విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్టు భద్రతా బాధ్యతలు త్వరలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (CISF)కు అప్పగించబడనున్నాయి. ఇప్పటివరకు ఈ ఎయిర్‌పోర్టు భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక పోలీసు బలగాలు (SPF) నిర్వహించేవి. అయితే, ఎయిర్‌పోర్టు అథారిటీ ఇటీవల ఏపీ డీజీపీకి లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో గన్నవరం ఎయిర్‌పోర్టు భద్రతా బాధ్యతలు ఇకపై CISF నిర్వహిస్తుందని, అందువల్ల SPF సిబ్బందిని అక్కడి నుండి వెంటనే ఉపసంహరించాలని కోరింది.
లేఖలో, జూలై 2 నుండి గన్నవరం ఎయిర్‌పోర్టు భద్రతా బాధ్యతలు పూర్తిగా CISF పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. అందువల్ల SPF సిబ్బందిని గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి హటావించి, వారి బ్యారక్‌లను ఖాళీ చేయాలని డీజీపీని ఎయిర్‌పోర్టు అథారిటీ కోరింది. CISF సిబ్బంది ఎయిర్‌పోర్టు భద్రతా బాధ్యతలు చేపట్టాలని తేల్చి చెప్పారు.